ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఆటగాళ్లు అదరగొట్టారు…యువ క్రికెటర్ల ఆట ఎవరూ మర్చిపోలేకపోతున్నారు, ఇక దేశ వ్యాప్తంగా మంచి ప్రశంసలు వస్తున్నాయి మన ఆటగాళ్లకు.. సిరాజ్, సుందర్ వంటి కొత్త ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రా జట్టులోని ఆరుగురు ఆటగాళ్లకు మంచి గిఫ్ట్ లు ఇస్తున్నట్లు ప్రకటించారు.
మహ్మద్ సిరాజ్,
శార్దూల్ ఠాకూర్
వాషింగ్టన్ సుందర్,
నటరాజన్,
శుభ్ మాన్ గిల్,
నవదీప్ సైనీ
వీరు ఆరుగురికి నజరానా ప్రకటించారు ఆనంద్ మహీంద్రా…వీరికి సరికొత్త మోడల్ థార్ వాహనాలను బహూకరిస్తున్నాను అని తెలిపారు, అంతేకాదు ఈ గిఫ్టులకి కంపెనీకి సంబంధం లేదు ఆయన సొంత నగదుతో ఇవి అందించనున్నారు. యువత ఇలా ఎన్నో విజయాలు అందించాలని ..యువత తమను తాము నమ్మేలా ప్రేరణ కలిగించేలా ఆయన ఈ కానుకలు ఇస్తున్నట్లు తెలిపారు.