భార్య గర్భం దాల్చింది భర్త హ్యాపీ – నేనే తండ్రినంటూ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇద్దరు ప్రియులు

Wife pregnant husband shocked

0
89

కొన్ని కొన్ని దారుణాలు ఘ‌ట‌న‌లు అసలు వినడానికి ఏదోలా ఉంటుంటాయి. ఇక వివాహానికి ముందు అఫైర్లు పెట్టుకోవ‌డం, పెళ్లి అయిన తర్వాత కొందరు అఫైర్లు పెట్టుకుని జీవితాలు నాశ‌నం చేసుకుంటున్నారు. (కొంద‌రు ) చివరకు భార్య భర్తలు ఒకరిని ఒకరు హత్యలు చేసుకుంటున్న ఘటనలు చూస్తున్నాం. తమిళనాడులో ఓ యువతి భర్త పరిస్దితి చూసి అందరూ షాక్ అవుతున్నారు ఎవరికి రాని కష్టం అతనికి వచ్చింది.

సేలం జిల్లాలో 23 ఏళ్ల ఓ యువతిని స్ధానికంగా ఉన్న‌ ఓ వ్యక్తి రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమెకి పెళ్లికి ముందు నుంచే ఇద్దరు యువకులతో అఫైర్ నడుస్తుంది. భర్త ఉన్నా ఆ ఇద్దరు ప్రేమికుల‌తో అఫైర్ నడిపింది. చివరకు ఇటీవల ఆమె గర్భవతి అయింది. భర్త ఎంతో ఆనందించాడు తాను తండ్రిని అవుతున్నా అని అందరికి చెప్పుకున్నాడు.

అయితే భర్త కంటే ఎక్కువగా ఇద్దరు ప్రేమికులు సంబరపడ్డారు. ఆమెకి పుట్టబోయే బిడ్డకు తండ్రిని తానంటే తాను అని ఇద్దరు గొడవపడ్డారు. విచక్షణ మరిచి కత్తితో ఓ ప్రియుడు మరో ప్రియుడిపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆ వ్యక్తి చనిపోయాడు.
ఈ విషయం పై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఆభర్త ఆనందం క్షణాల్లో ఆవిరి అయింది. తన భార్య మాత్రం మౌనంగా ఉంది.