ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరగనున్న యాషెస్ టెస్టు సిరీస్‌లో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కూడా ఆడనున్నాడు. ఈ మేరకు స్టోక్స్‌ను సెలెక్ట్ చేస్తున్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. నవంబర్ 4న జట్టు సభ్యులతో కలిసి ప్రయాణించనున్నాడని తెలిపింది.
మానసిక ఒత్తిడి కారణంగా గత జులై నుంచి విశాంత్రిలో ఉన్నాడు స్టోక్స్. ఈ ఏడాది జరిగిన భారత్-ఇంగ్లాండ్ సిరిసీలోనూ పాల్గొనలేదు.
ఇంగ్లాడ్ జట్టు: జో రూట్, జేమ్స్ అండర్సన్, బెయిర్ స్టో, డామ్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, బట్లర్, జాక్ క్రాలీ, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, జాక్ లీచ్ , మలాన్, ఓవర్టన్, ఒలీ పోప్, రాబిన్సన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, బెన్ స్టోక్స్.