డికాక్​ క్షమాపణలు..మ్యాచ్​ నుంచి తప్పుకోవడంపై వివరణ

Decock apologizes..explain about missing the match

0
97

వెస్టిండీస్​తో జరిగిన మ్యాచ్​ నుంచి తాను తప్పుకోవడంపై వివరణ ఇచ్చాడు దక్షిణాఫ్రికా వికెట్​కీపర్​, బ్యాటర్​ క్వింటన్​ డికాక్​. తాను అలా చేసినందుకు సహ ఆటగాళ్లకు, అభిమానులకు క్షమాపణలు కూడా  చెప్పాడు.

ప్రతి మ్యాచ్​ ముందు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మోకాళ్లపై కూర్చొని బ్లాక్​ లైవ్స్ మ్యాటర్​కు సంఘీభావం తెలపాలని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో డికాక్​.. మోకాళ్లపై కూర్చోవడం ఇష్టం లేక మ్యాచ్​ నుంచి తప్పుకొన్నాడు. దీంతో అతడి నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అతడు వివరణ ఇచ్చాడు.

ముందుగా నా సహా ఆటగాళ్లకు, అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాను. దీన్ని క్వింటన్​ సమస్యగా చూపాలనుకోవట్లేదు. జాతివివక్షకు వ్యతిరేకంగా చేస్తున్న ఈ సంఘీభావ ప్రక్రియకు ఉన్న ప్రాధాన్యం నేను అర్థం చేసుకోగలను. ఇలా సంఘీభావం తెలపడం ఆటగాళ్ల బాధ్యత అని కూడా తెలుసు. మోకాళ్ల మీద కూర్చోవడం వల్ల ఇతరుల జీవితాలు బెటర్​గా ఉంటాయనుకుంటే మోకాలిపై కూర్చోవడం నాకెంతో సంతోషం. వెస్టిండీస్​తో మ్యాచ్​ నుంచి తప్పుకొని ఎవరినీ అగౌరవపరచాలని అనుకోలేదు. ముఖ్యంగా విండీస్​​ జట్టును. నా వల్ల బాధ పడిన ప్రతిఒక్కరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా. నన్ను క్షమించండి. నాకు అండగా ఉన్న సహ ఆటగాళ్లకు ధన్యవాదాలు. నా దేశం కోసం ఆడటాన్ని ప్రేమిస్తాను అని డికాక్ తెలిపాడు.