టీం ఇండియా టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను నియమించారు. న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌కు కోహ్లీ దూరమయ్యాడు. అయితే కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకున్న తరువాత కోహ్లీ ఆటగాడిగా కొనసాగుతానని చెప్పాడు. కానీ కోహ్లీ పేరు బీసీసీఐ ప్రకటించిన జట్టులో లేకపోవడం షాక్ కు గురి చేసింది. దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ హెడ్‌కోచ్‌గా టీమ్ఇండియాకు తొలి సిరీస్ ఇదే కావడం విశేషం.
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చహల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్.
భారత్, కివీస్ మధ్య టీ20 సిరీస్ నవంబర్ 17-21 మధ్య జరగనుంది. తొలి మ్యాచ్ జైపూర్(నవంబర్ 17), రెండో మ్యాచ్ రాంచీ(నవంబర్ 19), మూడో మ్యాచ్ కోల్‌కతా(నవంబర్ 21) వేదికగా జరగనున్నాయి. అనంతరం భారత్‌తో టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది కివీస్. నవంబర్ 25-29 మధ్య కాన్పుర్‌లో తొలి టెస్టు, డిసెంబర్ 3-7 మధ్య ముంబయి వేదికగా రెండో టెస్టు జరగనుంది.