క్రికెట్ అభిమానులకు చేదువార్త

Bad news for cricket fans

0
85

క్రికెట్ అభిమానులకు చేదువార్త. 2028 లాస్‌ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఆడించడం కోసం చేస్తున్న ప్రయత్నాలకు దెబ్బ తగిలింది. క్రికెట్‌ సహా బాక్సింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, ఆధునిక పెంటాథ్లాన్‌ ఒలింపిక్స్‌కు ఎంపిక చేసిన 28 క్రీడల ప్రాథమిక జాబితాలో చోటు కోల్పోయాయి. దీనితో మరోసారి నిరాశే మిగిలింది.

ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే దిశగా ఐసీసీ ఈ ఆగస్టు నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఈ క్రీడ ప్రాచుర్యం, యువతలో క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌లో ఐవోసీ క్రికెట్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. 1900 పారిస్‌ క్రీడల్లో మాత్రమే ప్రాతినిధ్యం వహించిన క్రికెట్‌.. 2028 ఒలింపిక్స్‌లో కచ్చితంగా ఉంటుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో బేస్ బాల్‌ను కూడా చేర్చారు. ఈ ఏడాది కూడా బేస్‌బాల్ ఒలింపిక్స్‌లో స్థానం దక్కించుకుంది. ఒలింపిక్స్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఆటలను చేరుస్తూ ఉంటారు. కొన్ని ఆటలను తొలగిస్తూ ఉంటారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో బ్రేక్ డ్యాన్స్‌ను చేర్చనున్నట్లు ఇటీవలే ప్రకటించారు.