పాకిస్థాన్ ఓపెనర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ అరుదైన ఘనత సాధించాడు. వెస్టిండీస్‌తో చివరి టీ20 మ్యాచ్‌లో భాగంగా ఒకే ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో 2000 పరుగులు చేసిన మొదటి క్రికెటర్‌గా నిలిచాడు.
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా ఈ ఘనత సాధించాడు రిజ్వాన్. కరాచీ వేదికగా జరిగిన చివరి టీ20 మ్యాచ్ 11వ ఓవల్‌లో రిజ్వాన్ ఈ మైలురాయిని అందుకున్నాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు పాకిస్థాన్, వెస్టిండీస్ క్రికెట్ బోర్డులు ప్రకటించాయి.
ఆటగాళ్ల శిబిరంలో కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాయి. గురువారం మూడు మ్యాచ్‌ల టీ20 సీరీస్ పూర్తయిన తర్వాత ఇరుదేశాల క్రికెట్ బోర్డులు ఈ మేరకు ప్రకటన చేశాయి. వచ్చే ఏడాది జూన్‌లో మళ్లీ రీషెడ్యూల్ చేయనున్నట్లు వెల్లడించాయి.