ఐపీఎల్ 2022 సీజన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చె నెల 12, 13 తేదీలలో జరిగబోయే మెగా వేలానికి ముందు ఈ రెండు ఫ్రొచైంజ్ లు ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకోవాల్సి ఉంది. ఈ ఏడాది 10 జట్లు పాల్గొనబోతున్నాయి. కొత్తగా లక్నో, అహ్మదాబాద్ ఫ్రొచైంజ్ లు వచ్చిన విషయం తెలిసిందే. ఈసారి మొత్తం 1214 మంది క్రికెటర్లు ఈ వేలంలో భాగం కానున్నారు.
ఐపీఎల్‌లో విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. ఏ ఆటగాడైనా ఆ జట్టులో కనీసం ఒక్కసారైనా ఉండాలనుకుంటాడు. అందుకు ప్రధాన కారణం కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ. అయితే, ఈ సారి మెగా వేలం నిర్వహిస్తున్న నేపథ్యంలో ధోనీ సైతం పలువురు ముఖ్యమైన ఆటగాళ్లను వదులుకోవాల్సి వచ్చింది. దీంతో వారిప్పుడు వేలంలో పాల్గొంటున్నారు. ఒకవేళ చెన్నై వదిలేసిన ఆటగాళ్లలో మళ్లీ తీసుకోవాలనుకుంటే అందులో ఎవరున్నారో చూద్దాం..
చెన్నై జట్టులో ధోనీ (4,746) కన్నా సురేశ్ రైనా (5,528)నే బ్యాట్స్‌మన్‌గా ఎక్కువ విజయవంతమయ్యాడు. వీళ్లిద్దరూ 2008 నుంచే (2016, 17 మినహా) సీఎస్కేలో కొనసాగుతున్నా.. ఈ సారి మెగా వేలం నిర్వహిస్తుండటం వల్ల చెన్నై టీమ్ తొలిసారి రైనాను వదిలేసింది. మళ్లీ రైనాను ఇప్పుడు తీసుకోవడం కష్టమనే చెప్పుకోవాలి.
శార్దూల్ ఠాకూర్ కొంత కాలంగా చెన్నై జట్టులో కీలకంగా మారిన పేస్ ఆల్‌రౌండర్. మ్యాచ్ మధ్యలో బౌలింగ్‌కు రావడం.. చకచకా వికెట్లు తీయడం.. ప్రత్యర్థిని ఇరకాటంలో నెట్టడం శార్దూల్‌కు అలవాటైన పని. ఈ క్రమంలోనే నాలుగేళ్లలో చెన్నై జట్టులోని కీలక ఆటగాళ్లలో ఒకడిగా రాణిస్తున్నాడు. ఈ నాలుగేళ్లలో శార్దూల్ బ్యాటింగ్ పరంగా రాణించకపోయినా బౌలింగ్‌లో 55 వికెట్లు సాధించడం విశేషం. దీంతో చెన్నై మిడిల్ ఆర్డర్ కోసమైనా ఈ లార్డ్‌ను ఎంపిక చేసుకునే వీలుంది.
దీపక్ చాహర్ ఆదిలోనే కొత్త బంతితో వికెట్లు తీయడం. తొలి స్పెల్‌లో ప్రత్యర్థి టాప్‌ఆర్డర్‌ను దెబ్బ తీయడం అతడికి తేలికైపోయింది. ఏ జట్టు అయినా.. బ్యాట్స్‌మెన్ ఎంతటివాడైనా వికెట్లే లక్ష్యంగా బౌలింగ్ చేస్తాడు. ఒకవేళ ఇతర జట్లు దీపక్ కోసం పోటీపడకపోతే ఈ పేస్ ఆల్‌రౌండర్‌ను కచ్చితంగా తిరిగి కొనుగోలు చేసే అవకాశం లేకపోలేదు.