Flash: క్రికెట్ కు టీమిండియా స్టార్ ప్లేయర్ గుడ్‌బై!

0
94

టీమిండియా ఫాస్ట్​ బౌలర్ ​ శ్రీశాంత్​ రిటైర్మెంట్​ ప్రకటించారు. భారత్ తరఫున ఫస్ట్​క్లాస్​ క్రికెట్​ సహా అన్ని ఫార్మాట్లకు నుంచి రిటైర్మెంట్​ తీసుకున్నారు. “భవిష్యత్​ తరం క్రికెటర్ల కోసం నా ఫస్ట్​క్లాస్​ క్రికెట్​ కెరీర్​ను ముగించాలని అనుకుంటున్నాను.” అని శ్రీశాంత్ ట్వీట్​ చేశారు. టీమిండియా తరఫున శ్రీశాంత్ చివరగా 2011లో ఆఖరిగా అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు.

2012లో ఐపీఎల్​ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ బౌలర్ శ్రీశాంత్​ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.  ఆ తర్వాత తప్పు ఒప్పుకోవడం వల్ల ఇతడిపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. 2018లో బ్యాన్ ఎత్తివేసి, ఇంగ్లాండ్ దేశవాళీ క్రికెట్​ ఆడేందుకు అతడికి అనుమతిచ్చింది.  గత నెలలో జరిగిన ఐపీఎల్‌ మెగా వేలంలోనూ రూ. 50 లక్షల కనీస ధరతో తన పేరును నమోదు చేసుకున్నా ఫలితం దక్కలేదు.