వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ ఇండియా, వెస్టిండీస్ ఉమెన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. హామీల్టన్ వేదికగా జరిగిన ఈ వన్డే మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవరల్లో ఏకంగా 8 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. బ్యాటర్లు స్మృతి మంథాన, హర్మన్ ప్రీత్ కౌర్ సెంచరీలతో మెరిశారు. భారీ టార్గెట్ ఛేదనకు దిగిన వెస్టిండీస్ జట్టు 40.3 ఓవర్లలో 162 కు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 155 పరుగుల తేడాతో విజయం అందుకుంది.
Breaking: టీమిండియా అదరహో..వెస్టిండీస్ పై గ్రాండ్ విక్టరీ
Teamindia Adarho..Huge win over West Indies