మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..అమెజాన్ లో సర్కారు వారి పాట స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

0
114

స్టార్‌ డైరెక్టర్‌ పరుశురాం దర్శకత్వంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్‌ బాబు, కీర్తి సురేష్ నటించిన “సర్కారు వారి పాట” గురువారం థియేటర్లలో విడుదలయి మహేష్ ఫాన్స్ ను అబ్బురపరిచింది. నవీన్ ఎర్నేని, వైరవిశంకర్ మరియు గోపి ఆచంట నిర్మాతలుగా బాధ్యతలు స్వీకరించి తెరెకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా గురువారం థియేటర్లలో విడుదలయి పాజిటివ్ టాకుతో దూసుకుపోతుంది.

బ్యాంకింగ్ నేపథ్యంలో కొనసాగిన ఈ సినిమాలో మహేష్ యూఎస్ లో ఓ బ్యాంక్‌ లో రికవరీ ఎంప్లాయ్‌గా కొత్త లుక్ లో కనపడి అభిమానులను ఖుషి చేసాడు. కేవలం 12 రోజుల్లో రూ.200 కోట్ల రూపాయిలు క్రాస్ కలక్షన్ చేసి టాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచినట్టు చిత్ర బృందం ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఈ చిత్రాన్ని ఓటీటి లో ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అంటూ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుండడంతో ఓటిటి విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు చిత్రబృందం.

ఓటిటి విడుదల తేదీ విషయంలో జూన్-10 లేదా జూన్ 24వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్నట్టు సమాచారం తెలుస్తుంది. కాకపోతే ‘సర్కారు వారి పాట’ ను అందరికీ అందుబాటులోకి తీసుకురాలేదు. పే పర్ వ్యూ రెంటల్ విధానంలో ఈ చిత్రాన్ని డిజిటల్ రిలీజ్ చేశారు. కావున వినియోగదారులు రూ.199 చెల్లిస్తే చూడవచ్చు అన్నట్లుగా తెలియజేయడంతో మహేష్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.