నిరుద్యోగులకు గుడ్ న్యూస్..గ్రూప్ 4 నోటిఫికేషన్ అప్పుడే!

0
137

తెలంగాణలో కొలువులు ఓ కొలిక్కొచ్చాయి. ఇప్పటికే గ్రూప్ 1, పోలీస్ కొలువులకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. వాటికి దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసింది. ఇక మిగతా జాబ్ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.

తాజాగా గ్రూప్ 4కు సంబంధించి తాజా అప్ డేట్ వచ్చింది. అదేంటంటే.. ప్రస్తుతం లెక్కల ప్రకారం ఆఫ్ ది రికార్డ్ గా గ్రూప్ 4లో 20వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు తేలింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఖాళీలుగా పరిగణించకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని సమాచారం. కొన్ని శాఖల నుంచి ఖాళీలు, భర్తీ చేయాల్సిన లెక్కలతో కమిషన్ కు పంపించారు.ఇలా కమిషన్ కు పంపించే వాటిలో స్పష్టత ఉండటం లేదు. కొన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలు సమర్పించినా ఆర్థిక శాఖ వద్ద అవి పెండింగ్ లో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు కూడా ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు లేనట్లే తెలుస్తోంది. జూలై 31లోగా జాబితాలు కమిషన్ కు అందిస్తే.. వాటిని పరిశీలించి అన్ని శాఖల నుంచి క్లారిటీ తీసుకుంటుందని టీఎస్పీఎస్సీ అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ నోటిఫికేషన్ ఆగస్టు చివరలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చే అవకాశం కనిపిస్తోంది.