ఎన్టీఆర్ బయోపిక్ లో ఆ పాత్రకి కీర్తి సురేష్ ఫిక్స్

ఎన్టీఆర్ బయోపిక్ లో ఆ పాత్రకి కీర్తి సురేష్ ఫిక్స్

0
113

బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని చేస్తున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ సినిమాని టాలీవుడ్ టాప్ డైరెక్టర్ క్రిష్ అద్వర్యం లో తెరకెక్కుతుంది. ఇందులో బాలకృష్ణ, విద్యాబాలన్, ప్రకాష్ రాజు, మోహన్ బాబు , సీనియర్ నరేశ్ ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ని కొంతమేర పూర్తీ చేసుకున్నది. ఎన్టీఆర్ సినీజీవితం లో సావిత్రిగారి పాత్ర చాల కీలకం. ఎన్టీఆర్, సావిత్రి గారు కలిసి ఎన్నో మరపురాని చిత్రాల్లో నటించారు. కాబట్టి ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా సావిత్రి గారి పాత్రను కచ్చితంగా చూపించాలి. దీనిపై దర్శక, నిర్మాతలు యక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.

ఇప్పుడు అందరికి మహానటి సావిత్రి గారు అంటే టక్కున గుర్తొచ్చే పేరు, టాలీవుడ్ టాప్ హీరోయిన్ కీర్తి సురేష్. అంతలా ఆమె తెలుగు ప్రేక్షకులని మహానటి సినిమాతో కట్టిపడేసింది. అచ్చు సావిత్రిని చూస్తున్నాము అనేంతలా ఆమె నటన సాగింది.

ఇప్పుడు సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ ను కాకుండా మరో కథానాయికను ప్రేక్షకులు ఊహించుకోవడం చాల కష్టం. అందువలన ఆమెను తీసుకోనున్నట్టు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.