శ్రియ…భారీ రెమ్యూనరేషన్ అడుగుతోంది!

శ్రియ...భారీ రెమ్యూనరేషన్ అడుగుతోంది!

0
39

మళ్ళీ రీఎంట్రీ తో సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతూ అటు తమిళ్, ఇటు తెలుగులో వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటుంది శ్రియ శరణ్. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు చిత్రాలు ఉన్నాయి. అందులో కొత్త దర్శకురాలు సుజనా తెరకెక్కిస్తున్న చిత్రం ఒకటి. లేడి ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిహారిక కీలక పాత్రలో కనిపించనుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఙ్ఞాన శేఖర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్రం కోసం శ్రియ భారీ రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేస్తున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. తనకు అరకోటి ఇవ్వాల్సిందేనని శ్రియ డిమాండ్ చేసిందట. అయితే అందుకు దర్శకుడు కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.