2019 ఎన్నికలకు చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్..

2019 ఎన్నికలకు చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్..

0
61

ఏపీ లో 2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడడం తో అన్ని ప్రధాన పార్టీలు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు తన అనుభవానికి పదును పెట్టి ఇప్పటి నుండి నిత్యం నేతలు ప్రజల్లో ఉండేలా పక్కాగా షెడ్డ్యూల్ రెడీ చేసారు.

అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంటూ నవ నిర్మాణ దీక్షలతో చంద్రబాబునాయుడు ప్రజల్లో తనకు ఉన్న మంచిపేరుని పెంచుకుంటూ పోతున్నాడు. మరో పక్క ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత జగన్ కూడా పాదయాత్ర ద్వారా నిత్యం ప్రజల్లో ఉంటూ, సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వం పై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికలని చాలా సీరియస్ గా తీసుకున్నాడని అందరికి తెలుసు. పవన్ కింగ్ కాలేకపోయినా, కింగ్ మేకర్ అవ్వగలను అని ప్రజల్లోకి వెళ్లి తన స్టైల్ లో ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు. కానీ ప్రతిపక్షాలు ఎన్ని చేసిన చంద్రబాబు అధికారాన్ని అంట సులువుగా వదులుకుంటారని ఎవ్వరు అనుకోరు….తనకున్న అనుభవం తో ఎన్నికల సమయానికి పక్క ప్రణాళికతో ప్రజల ముందుకు వచ్చి అధికారాన్ని మళ్ళీ అందుకుంటాడని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.