Minors Campaigning on Munugode Bypoll మునుగోడులో ఉప ఎన్నిక వాడివేడిగా జరుగుతున్న సమయంలో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ భుత్‌ల వద్ద వేచి చూస్తుంటే.. మరో వైపు పార్టీ కార్యకర్తలు మైనర్లతో పార్టీ ప్రచారం చేయిస్తున్నారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ విడీయోలో కొందరు పిల్లలు టీఆర్ఎస్‌కు సంబంధించిన ప్లకార్డ్స్ పట్టుకొని ప్రచారం చేస్తున్నారు. దీంతో ఓ పోలీస్ అధికారి స్థానిక మైనర్లను వారితో ఉన్న వారిని హెచ్చరించారు. పోలింగ్ రోజున టీఆర్ఎస్ ప్లకార్డ్స్ పట్టుకొని ప్రచారం చేయడం ఈసీ నిబంధనలకు వ్యతిరేఖమని పిల్లలకు చెబుతూ.. హెచ్చరించడం విడీయోలో కనిపిస్తుంది.
- Advertisement -