Minister Jagadesh Reddy comments on Munugode Bypoll counting:నరాలు తెగే ఉత్కంఠతో మునుగోడు బైపోల్ కౌంటింగ్ జరుగుతుంది. ఇప్పటి వరు రెండు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఆధిక్యం ప్రదర్శించగా, మరో రెండు రౌండ్లలలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాగా, మునుగోడు ఫలితాలను బీజేపీ కావాలనే ఆలస్యం చేయిస్తుందంటూ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. రాష్ట్ర ఎన్నికల అధికారులు, సిబ్బందిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భయపెట్టేలా ఫోన్‌లో మాట్లాడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రం నుంచి వచ్చిన ఎన్నికల పరిశీలకులు ఫలితాలపై అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ గెలుపు ఖాయం అవ్వటంతోనే.. బీజేపీ ఇలా చేస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కాగా, కౌంటింగ్ వద్దకు తమను అనుమతించటం లేదంటూ జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. సరైన ఫలితాలు వెల్లడించకుండా, అయోమయానికి గురి చేస్తున్నారంటూ జర్నలిస్టులు మండిపడుతున్నారు.
Minister Jagadesh:కావాలనే ఫలితాలను బీజేపీ ఆలస్యం చేయిస్తోంది
-