టీడీపీ ప్రభుత్వంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టులోని డయాఫ్రమ్ వాల్‌కు భారీ నష్టం వాటిల్లిందని, అది చాలా వరకూ దెబ్బతిన్నదని తెలిపారు. డయాఫ్రమ్ వాల్ దాదాపు 485 మీటర్ల మేర దెబ్బతిన్నదని అన్నారు. పెద్ద పెద్ద గుంతలు కూడా ఏర్పడ్డాయని అన్నారు. వీటిని సరి చేయకపోతే పనులు ముందుకు సాగవని చెప్పారు. దీన్ని సరి చేసేందుకు దాదాపు రూ.2 వేల కోట్ల వరకూ ఖర్చు అవుతుందని అన్నారు.
కాఫర్ డ్యాం పనులు పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్ నిర్మించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. పోలవరంపై తాను రాజకీయ ఆరోపణలు చేయడం లేదని, ఇది తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారి తెలియనితనం వల్ల జరిగిందని అన్నారు. ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసి, రిబ్బన్ కట్ చేయాలన్న తాపత్రయంతోనో కాఫర్ డ్యామ్ పనులు పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించారని అన్నారు. దానివల్లే ఇప్పుడు ఇంత అనర్థం జరిగిందని స్పష్టం చేశారు.
Read Also: ఇది మంచి పద్దతి కాదు.. ప్రధానికి విపక్ష నేతల లేఖ
Follow us on: Google News