నాకు రాజకీయ జీవితం ఇచ్చింది చంద్రబాబే: రాజాసింగ్

-

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu)ను బీజేపీ బహిషృత ఎమ్మెల్యే టి. రాజాసింగ్(Raja Singh) ప్రశంసలతో ముంచెత్తారు. తనపై విధించిన బహిష్కరణ వేటును ఇంకా తొలగించకపోవడంతో రాజాసింగ్ టీడీపీలో చేరబోతున్నారనే వార్తలు విస్తృతమయ్యాయి. తాజాగా.. ఆ వార్తలపై వివరణ ఇస్తూ.. చంద్రబాబును ఆకాశానికెత్తారు. ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ అత్యధిక స్థానాల్లో గెలుపొంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజాసింగ్(Raja Singh) అన్నారు. చంద్రబాబు అంటే తనకు చాలా గౌరవమని.. రాజకీయంగా తనకు చంద్రబాబే లైఫ్ ఇచ్చారని తెలిపారు. అంతేగాక, తన మెంటాలిటీకి బీజేపీ మాత్రమే సూట్ అవుతుంది అని చెప్పుకొచ్చారు. తనకు చంద్రబాబు అంటే గౌరవం అని చెప్పుకొచ్చారు. గౌరవం ఉండటం వేరు.. రాజకీయాలు వేరు అని ఆంధ్రాలో టీడీపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. తాను హిందూ ధర్మం కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కారణం చంద్రబాబే అని స్పష్టం చేశారు.

- Advertisement -
Read Also: ‘నల్గొండలో MP కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని గెలవనివ్వను’

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ పై కాంగ్రెస్ దాడి

నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండల కేంద్రంలోని డోకూరు పంక్షన్ హాలులో...

ఈ నవరత్నాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి

Health Benefits of Millet | మన భారత దేశంలోని రైతులు...