Karnataka |కర్ణాటకలో ఇటీవలే కొలువుదీరిన సిద్ధరామయ్య ప్రభుత్వానికి కొత్త తలనొప్పి వచ్చి పడింది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దీంతో చాలా గ్రామాల్లో ప్రజలు విద్యుత్ బిల్లులు చెల్లించమని కరాఖండిగా చెబుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలు కూడా టికెట్లు తీసుకోవడం లేదు. దీంతో బస్సు కండక్టర్లు, మహిళలకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం(Karnataka Govt) కొన్ని కీలక హామీలు వెంటనే అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు తెచ్చిన ‘మహిళా శక్తి’ పథకాన్ని(Mahila Shakti Scheme) అమలు చేసేందుకు సీఎం సిద్ధరామయ్య సిద్ధమైనట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Read Also:
1. వివేకా హత్య కేసు నిందితులను సీబీఐ వదిలిపెట్టదు: బీజేపీ
2. అమెరికా అధ్యక్షుడి హత్యకు యత్నించిన తెలుగు యువకుడికి భారీ శిక్ష
Follow us on: Google News, Koo, Twitter