TSPSC Case |టీఎస్పీఎస్సీ కేసులో అరెస్ట్ అయిన విద్యుత్ శాఖ డీఈ రమేష్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. బోర్డు నిర్వహించిన మూడు ప్రశ్నా పత్రాలను అమ్మటం ద్వారా 10 కోట్లు సంపాదించాలని రమేష్ ప్లాన్ వేసినట్టు రిమాండ్ రిపోర్ట్ ద్వారా తెలిసింది. ఈ క్రమంలో ఒక్కో అభ్యర్థి నుంచి రమేష్ రూ.20 నుంచి రూ.30 లక్షలకు బేరం కుదుర్చుకుని అడ్వాన్సులు కూడా తీసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో రమేష్ పరీక్ష సెంటర్ల ఇన్విజిలేటర్లను కూడా వలలోకి లాగి అభ్యర్థులు సెంటర్ లోపలికి ఎలక్ట్రానిక్ డివైస్‌లు తీసుకెళ్లే ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. గమనించాల్సిన అంశం ఏమిటంటే రమేష్‌కు హైదరాబాద్ తోపాటు బెంగళూరులో కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టుగా సిట్ విచారణలో తేలటం. తన భార్య హత్య కేసులో రమేష్ ఆరోపణలు ఎదురు కుంటుండటం.