సుప్రీంకోర్టు(Supreme Court)లో వైసీపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జీవో 115పై ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీం సమర్థించింది. వ్యాపారవేత్త కాట్రగడ్డ లలితేశ్ కుమార్‌కు(Katragadda Lalitesh Kumar) విశాఖలోని మర్రిపాలెంలో 17,135 చదరపు మీటర్ల భూమిని వెనక్కి తీసుకుంటూ జీవో 115ని ప్రభుత్వం జారీ చేయగా.. లలితేశ్ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు జీవో 115ని కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
దీంతో హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది. దీనిపై సుప్రీంలో జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ పంకజ్ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. లలితేశ్ కుమార్‌కు కేటాయించిన స్థలాన్ని వెనక్కు తీసుకోవాలనుకున్న ప్రభుత్వం నిర్ణయం సరికాదని తెలిపింది. ప్రభుత్వమే భూమి ఇచ్చి మళ్లీ వెనక్కి తీసుకుంటుందా? అని ప్రశ్నించింది. అనంతరం జీవో 115ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీం కోర్టు(Supreme Court) సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.