ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానా..?

ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానా..?

0
105

నా పేరు సూర్య ప్లాప్ సినిమా తరువాత మరో చిత్రాన్ని ప్రకటించని అల్లు అర్జున్ ప్రస్తుతం కుటుంబానికే సమయాన్ని కేటాయించాడు. ఈ నేపథ్యంలో తాజాగా తన కుటుంబానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడు. అందులో తన భార్య స్నేహ ఫొటోను షేర్ చేస్తూ.. ఓ మై గాడ్.. నమ్మలేకపోతున్నా. ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానా..? అంటూ కామెంట్ పెట్టాడు. దీనిపై నెటిజన్లు కూడా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’, ‘చాలా అందంగా ఉన్నారు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మరోవైపు స్నేహ తన కుమారుడు అయాన్, కుమార్తె అర్హలతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.