టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న జాన్వీ కపూర్

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న జాన్వీ కపూర్

0
53

అతిలోక సుందరి, శ్రీదేవి గారాలపట్టి జాన్వీకపూర్ దఢక్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో ట్రెండ్ సృష్టిస్తుంది. కలెక్షన్ల పరంగా బాగానే ఉండటంతో నిర్మాతలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జాన్వి నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి.

శ్రీదేవికి టాలీవుడ్‌లో వున్నక్రేజ్అంత ఇంతా కాదు అని అందరికి తెలిసిందే. ఆమె ఎక్కువ సినిమాలు టాలీవుడ్‌లోనే చేశారు. దీంతో జాన్వితో టాలీవుడ్ ఎంట్రీ ఇప్పించాలని బోనీకపూర్ అనుకుంటున్నట్టు సమాచారం.

అయితే జాన్వీని తెలుగులో ఓ స్టార్ హీరో ప‌క్కన హీరోయిన్‌గా తీసుకోవాల‌ని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నట్టు టాలీవుడ్ లో వినపడుతుంది . ఇప్పటికే ఆ దిశ‌గా దిల్ రాజు ప్రయ‌త్నాలు మొదలు పెట్టారని టాలీవుడ్ సమాచారం. ఆ సినిమా ఇప్పుడు పట్టాలెక్కుతుందో తెలియాల్సింది ఉంది.