Emergency Teaser |బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఎమర్జెన్సీ. 1977లో భారత ప్రధానిగా ఇందిరా గాంధీ(Indira Gandhi) హయాంలో ఎమర్జెన్సీ ఎందుకు విధించారు? ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ అడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యింది. నవంబర్ 24న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే తాజాగా ఎమర్జెన్సీ టీజర్(Emergency Teaser) రిలీజ్ చేశారు. భారత్‌లో ఎమర్జెన్సీ విధించారు. టెలివిజన్‌లు రద్దు చేశారు. అలాగే ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం.. ఆందోళనకారులను షూట్ చేయడం.. ఇలా 25 జూన్ 1975లో జరిగిన సందర్భాలన్నింటినీ ఒక్కొక్కటిగా చూపించారు. చివరగా.. దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత నా చేతుల్లో ఉంది.. ఎందుకంటే భారత్ అంటే ఇందిరా.. ఇందిరా అంటే భారత్ అంటూ డైలాగ్స్ కంగనా(Kangana Ranaut) వాయిస్ వినపడుతుంది. ఈ చిత్రంలో పూర్తిగా ఇందిరా గాంధీ లుక్‌లో మారిపోయారు కంగనా.. టీజర్‌లో ఆమెను చూస్తే ఇందిరా గాంధీలా కనిపించడం విశేషం.
Read Also:
1. మెగాస్టార్ ‘భోళా శంకర్’ టీజర్ విడుదల
2. టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై హీరో నిఖిల్ షాకింగ్ కామెంట్స్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat