హైదరాబాద్ గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. ఎన్నికల కమిటీలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)కు చోటు దక్కలేదని ఆయన అనుచరులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఉద్యమంలో పొన్నం ప్రభాకర్ కీలకంగా పని చేశారని.. అలాంటి వ్యక్తిని అవమానించారని నిరసన వ్యక్తం చేశారు. సీనియర్ నేతలు కుట్రలు చేయడం వల్లే ఎన్నికల కమిటీలో పొన్నంకు స్థానం దక్కలేదని ఆరోపించారు.
- Advertisement -
పార్టీలో పొన్నం(Ponnam Prabhakar)కు ప్రాధాన్యత ఇవ్వాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎదుట నినాదాలు చేశారు. అయితే పీసీసీ సమావేశం ఉండటం వల్ల ఆందోళన విరమించాలని పొన్నం వర్గీయులను కోరినట్లు తెలుస్తోంది. పీసీసీ సమావేశం తర్వాత మాట్లాడుదామని ఈ సందర్బంగా వారితో రేవంత్ రెడ్డి చెప్పినట్లు సమాచారం.