ఈ రోజు భరత్ అనే నేను వేడుక

ఈ నెల 28 న భరత్ అనే నేను వేడుక

0
111

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . కాగా ఆ సినిమా ఈనెల 28న 100 రోజులను పూర్తిచేసుకోబోతోంది దాంతో అభిమానుల సంతోషానికి అంతేలేకుండా పోతోంది . కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించాడు . మహేష్ బాబు ముఖ్యమంత్రి గా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 20న విడుదల అయ్యింది . వేసవిలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో ప్లాప్ లలో ఉన్న మహేష్ కు పెద్ద ఊరట నిచ్చింది ఈ భరత్ అనే నేను .

ఈ చిత్రం ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్ , మలయాళంలో కూడా విడుదల అయ్యింది . ఏప్రిల్ 20 న ఈ చిత్రం విడుదల కాగా జులై 28 నాటికీ వంద రోజులను పూర్తి చేసుకుంటోంది దాంతో వంద రోజుల పండగ ని భారీ ఎత్తున నిర్వహించడానికి అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు . మహేష్ వరుస ప్లాప్ లతో సతమతం అవుతున్న సమయంలో భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ రావడంతో సంతోషంగా ఉన్నాడు . కొరటాల శివ – మహేష్ ల కాంబినేషన్ లో శ్రీమంతుడు , భరత్ అనే నేను రెండు చిత్రాలు రాగా రెండు కూడా బ్లాక్ బస్టర్ లు అయ్యాయి . ఇక మహేష్ తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే , ఆ సినిమాని వచ్చే ఏడాది వేసవిలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు