అయోధ్యకు తిరుమల శ్రీవారి లడ్డూలు తరలింపు

-

దేశమంతా రామ నామ స్మరణతో మార్మోమోగుతోంది. తన జన్మ భూమిలో ఆ బాలరాముడు శాశ్వతంగా కొలువు దీరే అమృత ఘడియలకు వేళాయింది. జై శ్రీరామ్ నినాదాల మధ్య రాములోరి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చే రామభక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరికి వారు తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. దీంతో టీటీడీ కూడా లక్ష లడ్డూలను(Tirumala Srivari Laddu) అయోధ్యకు తరలించింది.

- Advertisement -

రామ భక్తులకు 25 గ్రాముల బరువు ఉంటే శ్రీవారి లడ్డూలను ప్రసాదంగా ఇవ్వనుంది. తిరుమ‌లలోని శ్రీ‌వారి సేవాస‌ద‌న్‌-1లో శ్రీ‌వారి సేవ‌కులు ఒక్కో క‌వ‌ర్‌లో రెండు చిన్న‌ ల‌డ్డూలు చొప్పున మొత్తం 350 బాక్సుల‌ను సిద్ధం చేశారు. దాదాపు 3వేల కేజీల బరువు ఉండే ఈ లడ్డూల తయారీలో 350 మంది శ్రీ‌వారి సేవ‌కులు ఈ సేవ‌లో పాల్గొన్నారు. స్వచ్ఛమైన దేశీయ ఆవునెయ్యిని వినియోగించి ఈ లడ్డూలు తయారు చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని(Tirumala Srivari Laddu) తిరుపతి విమానాశ్రయం నుంచి ప్రత్యేక కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా అయోధ్యకు తరలిస్తున్నారు. ఈ విమానం సాయంత్రంలోగా అయోధ్య(Ayodhya)కు చేరుతుంది.

Read Also: అయోధ్యలో నిర్మాణమౌతున్న రామయ్య, ఇతర భవ్య మందిర వివరాలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Annamalai | నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేను -అన్నామలై

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై(Annamalai) సంచలన ప్రకటన చేశారు. తాను...

CMRL Case | చిక్కుల్లో కేరళ సీఎం కూతురు… పదేళ్లు జైలు శిక్ష తప్పదా?

CMRL Case | కేరళ సీఎం పినరై విజయన్(Pinarayi Vijayan) కూతురు...