Nara Lokesh | ‘కుర్చీ మడతపెట్టి’.. జగన్‌కు లోకేష్ వార్నింగ్.. 

-

తెలుగు తమ్ముళ్లు, జనసైనికుల జోలికి వైసీపీ నేతలు వస్తే కుర్చీ మడతపెట్టి పరిగెత్తిస్తామని టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) హెచ్చరించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో ఆయన మాట్లాడారు. మీరు చొక్కాలు మడతపెడితే.. తాము మీ కుర్చీ మడత పెట్టి సీటు లేకుండా చేస్తామని సీఎం జగన్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ కుర్చీని మడతపెట్టి చూపించారు.

- Advertisement -

రాజధాని ఫైల్స్‌ సినిమా అంటే జగన్‌(YS Jagan)కు భయమేస్తోందని.. అందుకే ఆ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్దకు పోలీసులను పంపారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతే రాజధాని అన్నారని.. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులన్నారని విమర్శించారు. మూడు రాజధానులు అన్న సైకో జగన్.. ఉత్తరాంధ్రలో ఒక్క ఇటుకైనా వేశారా?అని నిలదీశారు. మూడు ముక్కలాట ఆడుతున్న జగన్‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు లోకేష్(Nara Lokesh).

Read Also: ‘రాజధాని ఫైల్స్‌’ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ 
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Allu Arjun | అల్లు అర్జున్ కి మరోసారి పోలీస్ నోటీసులు

హీరో అల్లు అర్జున్(Allu Arjun) కి మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు....

Rythu Bharosa | ముగిసిన క్యాబినెట్ భేటీ.. రైతు భరోసాపై రేవంత్ కీలక ప్రకటన

తెలంగాణ క్యాబినెట్(Telangana Cabinet) సమావేశం ముగిసింది. అజెండలోని 22 అంశాలపై చర్చించిన...