Shubman Gill | 255 పరుగుల ఆధిక్యంలో భారత్.. రోహిత్, గిల్ సెంచరీలు..

-

భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 473 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో భారత్ 255 పరుగుల ఆధిక్యంలో కొసాగుతోంది. ప్రస్తుతం కుల్దీప్ యాదవ్ (27), జస్ప్రీత్ బుమ్రా (19) క్రీజులో ఉన్నారు. ఓవర్ నైట్ స్కోరు 135/1తో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా దూకుడుగా ఆడింది. ఈ క్రమంలోనే కెప్టెన్ Rohit Sharma (103), Shubman Gill (110) సెంచరీలు సాధించారు.

- Advertisement -

ఇక కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న దేవదత్ పడిక్కల్(65) అర్ధసెంచరీతో రాణించాడు. మరో బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ కూడా 56 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. జడేజా 15, ధ్రువ్ జురెల్ 15 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 4 వికెట్లతో విజృంభించగా.. టామ్ హార్ట్ లే 2, జేమ్స్ ఆండర్సన్ 1, బెన్ స్టోక్స్ 1 వికెట్ తీశారు. అంతకుముందు ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు ఆలౌట్ అయింది.

Read Also: ‘కన్నప్ప’ ఫస్ట్ లుక్‌ విడుదల.. విల్లు ఎక్కుపెట్టిన మంచు విష్ణు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...