Kiran Abbavaram | ‘ఆరోజున అందుకే అలా మాట్లాడా’.. ‘క’ సక్సెస్ మీట్‌లో కిరణ్ అబ్బవరం

-

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram).. ‘క’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు. దీంతో ఈ సినిమా సక్సెస్ మీట్‌ను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కిరణ్.. మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఎమోషనల్ కావడంపై స్పందించలేదు. ఆరోజున అలా మాట్లాడటానికి చాలా బలమైన కారణం ఉందని చెప్పాడు. తాను ఆరోజు కూడా ఎవరినో ఇబ్బంది పెట్టాలని అలా మాట్లాడలేదని అన్నాడు. ‘‘మా సినిమాను ఇంతలా ఆదరించిన ప్రేక్షకుల థాంక్స్. ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధిస్తుందని

- Advertisement -

నేను కూడా ఊహించలేదు. మేము నాలుగు ప్రీమియర్ షోలే వేయాలని అనుకున్నాం. కానీ ప్రేక్షకుల కోసం వీటి సంఖ్య భారీగా పెంచాం. ప్రీమియర్స్‌కు కూడా 82 చోట్ల హౌస్‌ఫుల్ అయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అలా ఎమోషనల్ అవ్వాలని కానీ, అలా స్పీచ్ ఇవ్వాలని కానీ అనుకోలేదు. మా అమ్మ, ఆమె పడిన కష్టం గురించి చెప్పాలనుకున్నా. కానీ గతేడాది పడిన మాటల వల్ల వచ్చిన బాధతోనే అలా మాట్లాడేశా. అంతేకానీ ఇతరులను బాధపెట్టాలని కాదు. నేను ఎవరినీ తక్కువ చేసి మాట్లాడలేదు. నా బాధను మాత్రమే పంచుకున్నా’’ అని చెప్పాడు కిరణ్(Kiran Abbavaram).

Read Also: ఇండియాలోనే రిచెస్ట్ హీరో ఆస్తి విలువెంతో తెలుసా..!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Maharashtra CM | మహా సీఎంపై వీడిన ఉత్కంఠ.. ఎవరికి ఏ పదవంటే..

Maharashtra CM | మహారాష్ట్ర నూతన సీఎం అభ్యర్థిపై ఎట్టకేలకు ఉత్కంఠ...

Pushpa 2 | హైకోర్టులో ‘పుష్ప-2’కు లైన్ క్లియర్..

పుష్ప-2(Pushpa 2) సినిమా టికెట్ ధరల పెంపుపై సతీష్ అనే వ్యక్తి...