ముద్దుగుమ్మ కీర్తీ సురేష్(Keerthy Suresh) పెళ్ళి పీటలెక్కనుంది. ఈ సారి ఇది రూమర్ కాదు.. నిజమేనని పక్కాగా తెలుస్తోంది. ఇన్నాళ్లూ కీర్తి పెళ్ళి అంటూ అనేక వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఒకసారి బిజినెస్ మ్యాన్‌తో అని, మరోసారి ఫ్యామిలీ ఫ్రెండ్‌తో అని ఇలా ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అవన్నీ కూడా గాలి వార్తలే అని తేలిపోయింది. తాజాగా మరోసారి ఇటువంటి వార్తే సోషల్ మీడియా వేదికగా వినిపించడంతో ఇది కూడా రూమరే అని అనుకున్నారంతా. కానీ ఈ వార్త నిజమేనని క్లారిటీ వచ్చేసింది. ఈసారి కీర్తిని వివాహమాడేది ఎవరన్నది పేరుతో సహా బయటకొచ్చింది.
ఆంటోని తట్టిల్(Antony Thattil) అనే వ్యక్తితో కీర్తి సురేష్ చాన్నాళ్లుగా రిలేషన్‌లో ఉంది. కానీ ఎక్కడా కూడా ఈ విషయం బయటపడకుండా జాగ్రత్త పడింది. కానీ కొచ్చికి చెందిన ఆంటోనీని అతి త్వరలోనే కీర్తీ వివాహమాడనుందట. డిసెంబర్ 11-12 తేదీల్లో గోవా వేదికగా కీర్తి-ఆంటోనీ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారు. ఇవన్నీ కూడా అధికారికంగా తెలుస్తున్న విషయాలే. అతి త్వరలోనే కీర్తి(Keerthy Suresh) కూడా ఈ విషయాన్ని అభిమానులకు తానే స్వయంగా ప్రకటించనుందట.