Salman Khan | ‘నేను అదో గొప్ప అనుకునేవాడిని’.. యాటిట్యూడ్‌పై సల్మాన్ క్లాస్

-

బిగ్‌బాస్ 18వ సీజన్‌ను హోస్ట్ చేస్తున్న సల్మాన్ ఖాన్(Salman Khan).. తాజా ఎపిసోడ్‌లో రజత్ అనే కంటెస్టెంట్‌ యాటిట్యూడ్‌పై క్లాస్ తీసుకున్నాడు. మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండడని, కాలం మారేకొద్దీ ఎంతో కొంత మార్పు వస్తూ ఉంటుందని చెప్పాడు. అందుకు తానే నిదర్శనమని కూడా అన్నాడు. ఒకప్పుడు నేను కూడా చాలా పొగరుగా ఉండేవాడినని అన్నాడు. ‘‘ఒకప్పుడు నాది కూడా ఇదే యాటిట్యూడ్ ఉండేది. ఎవరైనా ఉన్నప్పుడు దర్జాగా టేబుల్‌పై కాలుపెట్టి మాట్లాడటం. చాలా రూడ్‌గా ఉండటం చేసేవాడిని. కానీ అది చాలా తప్పు రజత్.. అది మార్చుకోవాలి. గతంలో నేను పోలీస్ స్టేషన్‌లో కూడా అంతే కూర్చున్నా. ఏ తప్పూ చేయనప్పుడు నేనెందుకు భయపడాలి అన్నట్లు నా వాలకం ఉండేది. కానీ అది చాలా తప్పు’’ అని చెప్పాడు.

- Advertisement -

‘‘ఎవరైనా సీనియర్ అధికారులు బ్యాడ్జ్‌ ధరించి వస్తే తప్పకుండా లేచి గౌరవించాలి. ఆ పాత క్లిప్పింగ్ చూసినప్పుడు నేను గర్వంగా ఫీలవ్వను. అంత పొగరుగా కూర్చోవాల్సిన అవసరం ఏముంది? అనుకుంటా. పోలీసులను అగౌరవపరిచేలా అంత అహంకారంగా ఎందుకు ప్రవర్తించానని చాలా అనుకున్నాను. ఎంత బాధపడినా ఇప్పుడు దాన్ని మార్చలేను కదా. ఇప్పుడు నీపై కూడా నేను(Salman Khan) అంతే రూడ్‌గా మాట్లాడగలను. నీ కంటే నా గొంతు ఇంకా పెద్దది. కానీ నేనెలా అరవాలని అనుకోవడం లేదు’’ అని రజత్‌ను మందలించాడు సల్మాన్. ఈ వీడియో వైరల్ కావడంతో అభిమానులు సల్మాన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read Also: పారితోషికం పెంపుపై రాజ్‌కుమార్ క్లారిటీ..

Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ravanth Reddy | ‘ఢిల్లీకి ఎన్ని సార్లైనా వెళ్తా.. ఈరోజు అందుకే వెళ్తున్నా’

తన ఢిల్లీ పర్యటనలపై రాష్ట్రంలో జరుగుతున్న చర్చలపై సీఎం రేవంత్ రెడ్డి(Ravanth...

Rajkummar Rao | పారితోషికం పెంపుపై రాజ్‌కుమార్ క్లారిటీ..

ఒక్క సినిమా హిట్ అయిందంటే చాలు పారితోషికం పెంచేస్తారు హీరోలు. అందరూ...