అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమా ‘పుష్ప-2(Pushpa 2)’ రిలీజ్ గ్రాండ్‌గా జరిగింది. సినిమా తిలకించడానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రేక్షకులతో థియేటర్లు కిక్కిరిశాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఆర్టీ ఎక్స్ రోడ్స్ దగ్గర ఉన్న సంధ్య థియేటర్లొ(Sandhya Theatre) నిర్వహించిన ప్రీమియర్ షోలో అపశృతి చోటు చేసుకుంది. సినిమా రిలీజ్‌కు ముందు అక్కడకు అల్లు అర్జున్(Allu Arjun) రావడంతో అభిమానులతో థియేటర్ లోపలకు చొచ్చుకు వచ్చారు.
దీంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందులో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. బాలుడిని రక్షించడం కోసం పోలీసు సిబ్బంది ఎంతో శ్రమించారు. అనంతరం బాలుడిని హాస్పటల్‌కు తరలించారు. అయితే అక్కడ ఏర్పడిన పరిస్థితులను కంట్రల్ చేయలేకపోయిన పోలీసులు బన్నీ అభిమానులపై లాఠీ ఛార్జ్ చేశారు.
దిల్షుఖ్ నగర్ కు చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9) , సన్వీక (7) కలిసి పుష్ప 2(Pushpa 2) ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ X రోడ్స్ లోని సంధ్య 70 mmకు వచ్చారు. అదే సమయంలో సినిమాను అభిమానులతో కలిసి చూడటం కోసం అల్లు అర్జున్ కూడా సంధ్య థియేటర్‌కు వచ్చాడు. ఆ సమయంలో అభిమానులు థియేటర్ గేటు లోపలికి చొచ్చుకు వచ్చారు.
దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి, ఆమె కొడుకు శ్రీ తేజ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే స్పందించిన పోలీసులు వారిద్దరిని విద్య నగర్‌లోని దుర్గ భాయి దేశముఖ్ హాస్పిటల్‌కు తరలించారు. రేవతి అప్పటికే మృతి చెందగా, శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని బేగంపేట కిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. రేవతి మృతదేహాన్ని దుర్గాబాయి దేశముఖ్ హాస్పిటల్ నుండి గాంధీ మార్చురీకి తరలించారు.