Srikalahasti | శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

-

తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి(Srikalahasti) ఏర్పేడు మార్గంలోని మిట్టకండ్రిగ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులు వెళ్తున్న కారును లారీ ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు సైతం ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన ఓ కుటుంబం దైవదర్శనార్థం తిరుపతికి చేరుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకున్నారు.

- Advertisement -

అనంతరం శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకునేందుకు తిరుమల నుంచి బయలుదేరారు. అయితే శ్రీకాళహస్తి(Srikalahasti) ఏర్పేడు మార్గంలోని మిట్టకండ్రిగ వద్ద టీ స్టాల్‌కు వెళ్లాలనుకున్నారు. ఇంతలో వారిని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. రాంగ్ రూట్‌లో కారు ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

Read Also: తిరుమలకు భారీగా పోటెత్తిన భక్తులు

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు...

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024...