వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యే అభ్యర్థిగానే పోటీ చేస్తానని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి(Anam Ramanarayana Reddy) తేల్చిచెప్పారు. తాను ఎంపీ స్థానానికి పోటీ చేస్తాననే వార్తలు కేవలం ప్రచారం మాత్రమే అని స్పష్టంచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో జిల్లాలోని ఏ నియోజకర్గం నుంచైనా పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు(Nellore) జిల్లాలోని అన్ని స్థానాలు టీడీపీ క్లీన్‌స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రజాప్రతినిధులతోపాటు ఆ పార్టీ నాయకుల్లోనూ సొంత ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.
ఎన్నికల ముందు 60శాతం మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరుతారని.. ప్రస్తుతం వారి పనుల కోసం తాత్కాలికంగా వైసీపీలో ఉంటున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబరులో ముందస్తు ఎన్నికలు ఉండే అవకాశాలు కనపడుతున్నాయని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో వచ్చే ఎన్నికల్లోపు ఆనం(Anam Ramanarayana Reddy) టీడీపీలో చేరనున్నారనే సంకేతాలు అధికారికంగా ఇచ్చినట్లు అయింది.
మరోవైపు ఉదయగిరి నియోజకవర్గంలో కూడా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గతంలో ప్రత్యర్థులుగా ఉన్న నేతలంతా ఏకతాటిపైకి వస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బొల్లినేని వెంకట రామారావు, కంభం విజయరామిరెడ్డి ఒకే వేదికపైకి వచ్చారు. గానుగపెంటపల్లిలో సీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాల్లో ముగ్గురు పాల్గొన్నారు. గతంలో ప్రత్యర్థులుగా ఉన్న నేతలు మిత్రులుగా ఒకేచోట కనిపించటం ఆసక్తికరంగా మారింది.
Read Also: ఇక రాజకీయాలకు సెలవు.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
సీబీఐకు ఎంపీ అవినాశ్ రెడ్డి మరో లేఖ
Follow us on: Google News, Koo, Twitter