Pawan Kalyan :పవన్‌కు మహిళా కమిషన్ నోటీసులు.. వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

-

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇటివల అమరావతిలోని జనసేన కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికార పార్టీ వైసీపీని టార్గెట్‌ చేసి విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.. ఆ సమావేశంలో పవన్ మూడు పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకోస్తూ.. ‘‘నేను మూడు సార్లు పెళ్లి చేసుకున్నానని మూడు రాజధానులు పెట్టాలా? మీరు కూడా విడాకులిచ్చి. పెళ్లిళ్లు చేసుకోండిరా’ అని పవన్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఏపీ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది.

- Advertisement -

‘‘మూడు పెళ్ళిళ్ళపై మీ వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. మహిళాలోకానికి క్షమాపణ చెప్పాలి. ఇటీవల మీరు మూడు పెళ్ళిళ్లు పై చేసిన వ్యాఖ్యలు సమాజంలో పెద్ద దుమారం రేపాయి. భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చు అనే సందేశాన్ని ఇస్తూ మీరు మాట్లాడిన మాటలతో మహిళాలోకం షాక్‌‌కు గురైంది. మీ మాటల్లోని తప్పును తెలుసుకుని మహిళాలోకానికి మీరు వెంటనే సంజాయిషీ ఇస్తారని రాష్ట్ర మహిళా కమిషన్ ఎదురుచూసింది. ఇన్నిరోజులైనా మీ మాటలపై మీలో పశ్చాత్తాపం లేదు. మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసినందుకు మీ నుంచి క్షమాపణలూ లేవు. ఎవరి జీవితంలో అయినా మూడు పెళ్ళిళ్లు చేసుకోవలసి వస్తే అది ఖచ్చితంగా వ్యతిరేక అంశమే.

‘‘కోట్ల రూపాయలు భరణంతో విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను. చేతనైతే మీరూ చేసుకోండి.’’ అని మీరు అత్యంత సాధారణ విషయంగా ఎలా మాట్లాడగలిగారు.? కోట్లు, లక్షలు, వేలు ఎవరి స్థాయిలో వారు భరణం ఇచ్చి భార్యను వదిలించుకుంటూపోతే.. ఏ మహిళ జీవితానికి భద్రత ఉంటుంది.? ఒక సినిమా హీరోగా, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మూడు పెళ్ళిళ్లు పై మీ మాటల ప్రభావం సమాజంపై ఉంటుందని మీకు తెలియదా.? మిమ్మల్ని ఫాలో అవుతున్న యువత చేతనైతే మూడు పెళ్ళిళ్లు చేసుకోవచ్చు అనే అభిప్రాయాన్ని తలకెత్తుకోరా? మీ ప్రసంగంలో మహిళలను ఉద్దేశించి ‘‘స్టెప్నీ’’ అనే పదం ఉపయోగించడం తీవ్ర ఆక్షేపణీయం.

మహిళలను భోగ వస్తువుగా, అంగడి సరుకుగా భావించేవారు ఇటువంటి పదాలను ఉపయోగిస్తారు. మీ వ్యాఖ్యలపై ఇప్పటికే అనేక మంది మహిళలు మాకు ఫిర్యాదు చేశారు. మీ మాటలు అవమానకరంగా మహిళా భద్రతకు పెను ప్రమాదంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ మీకు ఈ నోటీసును జారీ చేస్తుంది.’’ అని ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసుల్లో పేర్కొంది

notice

Read also: Munugode: కారులో రూ.20 లక్షలు నగదు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహాసేన రాజేష్ యూటర్న్.. జనసేనను ఓడిస్తామని సంచలన వ్యాఖ్యలు..

ఏపీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా జనసేన పార్టీకి...

అంబటి రాంబాబు వ్యాఖ్యలపై అల్లుడు మరో వీడియో

ఏపీ ఎన్నికలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబు(Ambati...