మాజీ మంత్రి వివేకాహత్య కేసు(Viveka Murder Case) తప్పు దారి పట్టిస్తూ, సీబీఐ వ్యవస్థపై నమ్మకం లేకుండా అధికారులు పనిచేస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu) ఆగ్రహం వ్యక్తంచేశారు. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా సీబీఐ ఎందుకు తాత్సర్యం చేస్తుందని ప్రశ్నించారు. సొంత బాబాయ్ హత్య కేసులో నిందితుడైన తమ్ముడిని అరెస్టు చేయనీయకుండా సీబీఐ(CBI) అధికారులను సీఎం జగన్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అచ్చెన్న(Atchannaidu) వెల్లడించారు.
అవినాశ్ రెడ్డి(Avinash Reddy) అరెస్టు కోసం సీబీఐ అధికారులు స్థానిక పోలీసులని బతిమలాడటం సిగ్గుచేటని టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని సాక్షాత్తూ కర్నూలు జిల్లా ఎస్పీ, వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పటం దుర్మార్గమని మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ పరిరక్షించలేమని పాలకులే ఒప్పుకుంటున్నప్పుడు ఇక ప్రభుత్వం ఎందుకు? రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీబీఐపై ప్రజలకు నమ్మకం కలగాలంటే చిత్తశుద్ధితో పనిచేసి నిందితులను అరెస్ట్ చేయాలని పేర్కొన్నారు.
Read Also: ఇక రాజకీయాలకు సెలవు.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
Follow us on: Google News, Koo, Twitter