ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా చంద్రబాబు(Chandrababu) పాలన సాగిస్తే.. జగన్(Jagan) వచ్చాక ఏకంగా 100 సంక్షేమ పథకాలు రద్దు చేశారని మండిపడ్డారు. అందులో 27 దళితులకు చెందినవేనని, ఈ సైకో సీఎం వచ్చాక దళితులపై దాడులూ పెరిగాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ దళిత ద్రోహి అని వ్యాఖ్యానించారు. మరో ఏడాదిలో టీడీపీ(TDP) ప్రభుత్వం వస్తుందని, దళితులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం టీడీపీ కట్టుబడి ఉందని, దళితుల్లో 62 ఉప కులాలకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
దళిత యువతి కుటుంబానికి న్యాయం చేయాలని పోరాటంలో భాగంగా తొలిసారి పోలీస్ స్టేషనుకు వెళ్లానన్నారు. గుంటూరులో రమ్య అనే దళిత యువతిని ఓ మృగాడు హత్య చేస్తే, ఆ కుటుంబానికి రూ.5 లక్షలు సాయం చేశామని లోకేశ్(Nara Lokesh) గుర్తు చేశారు. అమరావతి దళిత రైతుల హక్కుల కోసం రెండోసారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లానన్నారు. వైసీపీ నాయకులు వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు కరుణాకర్ కుటుంబానికి టీడీపీ అండగా నిలిచి రూ.15 లక్షలు సాయం చేసి, తనఖాలో ఇంటిని విడిపించిన ఘనత టీడీపీదన్నారు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. దళితులకు చంద్రబాబు ప్రభుత్వంలో ఇన్నోవా, జేసీబీలు ఇచ్చి ఆత్మగౌరవాన్ని పెంచితే జగన్ వచ్చాక, ఇలాంటి పథకాలు అటకెక్కించడమే కాక, దళితులను ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు.
Read Also: మతం పేరుతో బీజేపీ ఎన్ కౌంటర్లు చేస్తోంది.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
Follow us on: Google News, Koo, Twitter