కోడికత్తి తరహాలో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి(Avinash Reddy) డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్(Satya Kumar) ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణకు అవినాశ్ సహకరించడం లేదన్నారు. సీబీఐకి రాష్ట్ర పోలీసులు సహకరించకుండా వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అన్నారు. ఈ కేసులో అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయమని ఆయన స్పష్టంచేశారు. వైసీపీ(YCP)లో సంస్కారం లేని నేతలే విపక్షాలపై నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నాలుగేళ్లలో సీఎం జగన్(Jagan) నయవంచక పాలన అందించారని విమర్శించారు. రాష్ట్రంలోని పంచభూతాల్లో ఏ ఒక్కదాన్నీ వదలకుండా వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆయన(Satya Kumar) ఆరోపించారు.
వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయం: బీజేపీ
-