ఓటర్ లిస్టులో అక్రమాలపై నిరంతర అప్రమత్తంగా ఉండి పోరాటం చేయాలని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదు, టీడీపీ అనుకూల ఓట్ల తొలగింపు అంశాలను సీరియస్‌గా తీసుకోవాలని చంద్రబాబు నాయుడు సూచించారు. ఓటమి భయంతో వైసీపీ ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడుతుందని.. దాని కోసం ఇప్పటి నుంచే కుట్రలు మొదలు పెట్టిందని చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ పరంగా జరుగుతున్న ఓటర్ వెరిఫికేషన్‌పై రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎలక్షన్ కమిటీ సభ్యులతో చంద్రబాబు నాయుడు పార్టీ కార్యాలయం లో సమీక్షించారు. ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు 20 లక్షల దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని నేతలు తెలిపారు. వీటిపై చర్యలు కోరుతూ అక్రమాలపై సాక్ష్యాధారాలతో సహా వివరాలను ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామని చంద్రబాబు(Chandrababu)కు నేతలు వివరించారు. చనిపోయిన వారి ఓట్లు తొలగించకపోవడం, దొంగ ఓట్లు నమోదు చేయడం, టీడీపీకి అనుకూలం అని భావించే వారి ఓట్లను తొలగించడం, ఒక బూత్ లో ఓట్లను మరో బూత్‌కు బదలాయించడం వంటి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని తాము కోరామని చెప్పారు.
Read Also:
1. డైట్ లో ఉన్నవారికి కొవ్వు లేని బెస్ట్ చిరుతిళ్ళు
2. అమరావతి ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat