ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి మొదలైంది. ఓవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) వారాహి యాత్ర(Varahi Yatra), నారా లోకేష్ యువగళం యాత్రలతో నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ వేదికగా జరుగుతోన్న ఎన్డీఏ కూటమి సమావేశాల్లో హాజరు కావాలని పవన్ కల్యాణ్‌కు ఆహ్వానం అందింది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లారు. ఈ సదర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ(TDP), జనసేన(Janasena), బీజేపీ(BJP) కలిసి పోటీ చేసే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రజలతో పాటు అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. టీడీపీ, బీజేపీ మధ్య సమన్వయం లోపించిందని, ప్రస్తుతం జనసేన, బీజేపీ కలిసి ఉన్నాయని తెలిపారు. మరికొన్ని రోజుల్లో మూడు పార్టీలు ఒకే తాటిమీదకు వచ్చే అవకాశం ఉందని పవన్(Pawan Kalyan) వ్యాఖ్యానించారు.