Kanna Lakshminarayana |బీజేపీని వీడి ఇటీవల టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీ నారాయణ మొదటిసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెడగొడుతున్నాడని అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం అరాచక పాలనకు నిదర్శనం అని అభిప్రాయపడ్డారు. ఓట్ల కోసం వాలంటీర్స్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి పాలన అవసరమా అని ప్రజలు ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు. తండ్రి కంటే మంచి పాలన అందిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్(Jagan).. టీడీపీపై ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతేగాక, ఒక ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా చంద్రబాబు(Chandrababu)పై వైసీపీ అసభ్యకరమైన భాష వాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kanna Lakshminarayana |సీఎం జగన్ పై కన్నా సంచలన వ్యాఖ్యలు
-