వైసీపీకి భారీ షాక్.. కోటంరెడ్డి టీడీపీలో చేరేది అప్పుడే!

0
Kotamreddy Sridhar Reddy

వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy) పార్టీ మార్పునకు ముహూర్తం ఖరారైంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన కోటంరెడ్డి.. అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఫిక్స్‌ అయ్యారు. ఈనెల చివరివారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కోటంరెడ్డితోపాటు మరి కొంతమంది కీలక నేతలు, ఆయన అనుచరులు భారీగా పార్టీ మారబోతున్నట్లు సమాచారం.

టీడీపీ(TDP)లో చేరి ఎన్నికల సమయానికి క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటించి అధికార వైసీపీకి భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం. అంతేకాదు టీడీపీలో పట్టుపెంచుకోవడంతోపాటు తరచూ పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం, పార్టీ చేరికలపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అధికార వైసీపీకి భారీ షాక్ తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 175 స్థానాలు టార్గెట్‌గా పెట్టుకొని ఇప్పటికే ఎమ్మెల్యేలను అలర్ట్ చేసిన సీఎం జగన్ కోటంరెడ్డి(Kotamreddy Sridhar Reddy) వ్యవహారంలో ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.

Read Also: అనుమతిస్తే లోపల.. లేదంటే.. బయట

Follow us on: Google News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here