ఫాంహౌజ్‌లో కూర్చొని KCR నెలకు రూ.4 లక్షలు తీసుకుంటున్నాడు: విజయశాంతి

0
Vijaya Shanthi

ఎమ్మెల్సీ కవితపై బీజేపీ సీనియర్ నేత విజయశాంతి(Vijaya Shanthi) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారంపై స్పందిస్తూ కవితపై సంచలన ఆరోపణలు చేశారు. గురువారం వనస్థలిపురంలోని మన్సూరాబాద్‌లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో విజయశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మహిళలకు మెతక వైఖరి సరికాదని.. స్ట్రాంగ్‌గా ఉండాలని విజయశాంతి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు.

ఫాంహౌస్‌లో ఉంటూనే సీఎం కేసీఆర్(KCR) రూ. 4 లక్షలు తీసుకుంటున్నారని అన్నారు. అయితే, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మాత్రం ఇవ్వరని విజయశాంతి(Vijaya Shanthi) ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతో నిరాశలో కూరుకుపోయి నిరుద్యోగులు న్యాయం కోసం డిమాండ్ చేస్తుంటే కేసీఆర్ సర్కార్ పోలీసులను ప్రయోగించి వారిపై క్రూరంగా ప్రవర్తిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నపత్రం లీకేజీపై నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ టీఎస్ పీఎస్సీ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన బీజేవైఎం నాయకులను రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.

Read Also: TSPSC చైర్మన్‌కు తెలియకుండా పేపర్ లీకవుతుందా? 

Follow us on: Google News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here