Minister Merugu Nagarjuna slams pawan kalyan and chandrababu చంద్రబాబు రాజకీయ లబ్దికోసం కుట్రలు చేస్తున్నారని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చెప్పులు, రాళ్లు వేయించుకుని లబ్ది పొందాలని చూస్తున్నారని విమర్శించారు. నిన్న నందిగామలో జరిగింది ఇలాంటి కుట్రలో భాగమేనని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కబంధ హస్తాల్లో జనసేనని చిక్కుకున్నాడన్నాడని.. పవన్‌కు సొంత రాజకీయలు చేసే నైపణ్యం లేదన్నారు. చంద్రబాబుపై రాయి వేయించాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. సీఎం జగన్ రాష్ట్రం కోసం పనిచేయని వ్యక్తి కాదన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వనికి బలమైన మద్దతు ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. జగన్ పాలన అంత గొప్పగా చేస్తున్నారని కొనియాడారు.