తెలుగు రాష్ట్రాల్లో మై విలేజ్ షో(My Village Show)తో అందరికీ దగ్గరైన గంగవ్వ(Gangavva) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకంటూ ఓ పేరు తెచ్చుకున్న ఆమె 60 ఏళ్ల వయసులో ఓ వివాదంలో చిక్కుకున్నారు. పాపం ఎవరో చేసిన తప్పుకు ఈ వయసులో కన్నీళ్లు పెట్టుకుంటూ క్షమాపణలు కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ తెలుగు న్యూస్ ఛానల్ ఇటీవల జాతకం పేరుతో ఓ ప్రోగ్రాం నిర్వహించింది. ఇది పూర్తిగా ఓ పార్టీ పెయిడ్ కార్యక్రమంలా సాగింది. ఇందులో పాల్గొన్న గంగవ్వ చేత చంద్రబాబు(Chandrababu) జాతకం అసలు బాగలేదు అంటూ ఆమె చేత చెప్పించారు. దీంతో గంగవ్వ వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోపై టీడీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో పరిస్థితి చేయి దాటిపోతోందని భావించిన గంగవ్వ, మై విలేజ్ షో టీం వెంటనే స్పందించారు. ఆ టీవీ ప్రోగ్రాం నిర్వాహకులు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే గంగవ్వ ఆ వ్యాఖ్యలు చేశారని దీనికి ఆమెకు వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు.
‘అందరికీ నమస్కారండి.. నాకు వాళ్లు ఏదైనా చెబితేనే అన్నానని.. నేను పెద్దగా చదువుకోలేదు. ఆ సారును నేను అనను అంటే ఆ టీవీ ఛానల్ వాళ్లు అనిపించారని తెలిపారు. మీరు తప్పుగా అనుకోవద్దు. క్షమించండి. నాకు ఏం తెలవదు.. వాళ్లు అనమంటేనే అన్నా. మీ అందరి వల్లే నాకు ఇంత పేరు, గూడు వచ్చింది. నేను మాట జారితే క్షమించడయ్యా అంటూ గంగవ్వ(Gangavva) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం చంద్రబాబుకు గంగవ్వ క్షమాపణలు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాపం 60ఏళ్ల వయసులో గంగవ్వ చేత ఇలా చెప్పించడంపై ఆ టీవీ ఛానల్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Also:
1. తిరుమల ఘాట్ రోడ్డులో బస్తు బోల్తా.. పలువురికి గాయాలు
2. అమరావతిలోని తుళ్లూరులో తీవ్ర ఉద్రిక్తత.. మహిళలు అరెస్ట్
Follow us on: Google News, Koo, Twitter