జగన్ పనైపోయింది.. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే వడ్డీతో సహా చెల్లిస్తా: లోకేశ్

-

శ్రీశైలం నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర చేస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara lokesh) సీఎం జగన్ పై లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో ప్రిజనరీ పీకిందేమీ లేదు.. ఇకపై పీకబోయేదీ ఏమీ లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏ1 జగన్(YS Jagan) తెచ్చిన జీవో నెం.1 చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చిందని.. ఆ జీవోను మడిచిపెట్టుకోవాలని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ రాజ్యాంగమే గెలిచిందని రాజారెడ్డి రాజ్యాంగం చెత్తబుట్టలో పడిందని విమర్శించారు.

- Advertisement -

ఇక తనను అడ్డుకోవడానికి ఏ1 వద్ద ఉన్న అన్ని అస్త్రాలు అయిపోయాయన్నారు. తన పాదయాత్రలో గొడవ చేయడానికి వైసీపీ కుక్కలను పంపుతున్నారని మండిపడ్డారు. ఈ సైకో జగన్ పనైపోయిందని.. అధికారంలోకి వచ్చేది టీడీపీ(TDP) ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లించే బాధ్యతను ఈ లోకేశ్(Nara Lokesh) తీసుకుంటాడని హెచ్చరించారు.

Read Also: కర్ణాటకలో బీజేపీ ఓటమికి ప్రధాన కారణం అదే: కిషన్ రెడ్డి 

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...