Ram Mohan Naidu |సీఎం జగన్‌పై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు సీరియస్

-

వైసీపీ ప్రభుత్వంపై శ్రీకాకులం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను సర్కార్ సకాలంలో వేయడం లేదని మండిపడ్డారు. సక్రమంగా 1వ తేదీకి జీతాలు చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలో ఉద్యోగులకు రెడ్ కార్పెట్ వేసేందని 14వ తేదీ వచ్చినా జీతాలు చెల్లించకుండా ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బందులు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

జగన్ సీఎం అయిన 7 రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి నాలుగేళ్లు అయినా రద్దు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో రోజురోజుకి టీడీపీకి పెరుగుతున్న ఆదరణను చూసి జగన్ తట్టుకోలేకపోతున్నారని అన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాలని సామాన్యులు కూడా కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజాదరణను చూసి జగన్‌ మతిభ్రమిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu).

Read Also:

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YS Sharmila | ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సీఎం జగన్‌కు 'నవ సందేహాల'...

Andhra Pradesh | ఏపీలో మొత్తం ఓటర్లు ఎంత మంది అంటే..?

ఏపీ(Andhra Pradesh)లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర...