ప్రొఫెసర్ల కేసులో ఏపీ సీఎం జగన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

-

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. తొలగించిన యూనివర్సిటీ ప్రొఫెసర్లకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ప్రొఫెసర్ల కేసులో ఏపీ సర్కార్ కు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. దీంతో ప్రొఫెసర్లను కొనసాగించడానికి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అంగీకరించింది. 2019లో జరిగిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చెల్లవని జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

- Advertisement -

దీనిపై ప్రొఫెసర్లు ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసులో విచారణ జరిపిన హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో ప్రొఫెసర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రొఫెసర్లను వెంటనే నియమించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు అసిస్టెంట్ ప్రొఫెసర్ల విచారణను వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...